Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియాలో ప్రస్తుతం కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త ఊపు తీసుకువచ్చారు.

తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ప్రపంచస్థాయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలానే ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులతో 'ఆరెంజ్ క్యాప్' కైవసం చేసుకున్న సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో అతడిని బరిలోకి దించాలని అభిమానుల నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తోంది.

అయితే, బెల్‌ఫాస్ట్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ సూర్యవంశీ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. అభిమానులను కొంత నిరాశకు గురిచేసినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ 'వ్యక్తుల కంటే జట్టే ముఖ్యం' అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతోంది.

ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడని, ఏ స్టేజ్ పైనైనా భయం లేకుండా ఆడగలడని ప్రశంసించారు. అయితే వ్యక్తిగత రికార్డుల కోసం ఇప్పటికే జట్టులో రాణిస్తున్న ఆటగాళ్లను పక్కన పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. 'ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం, ఇప్పటికే పరుగులు సాధిస్తూ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను(సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ) తొలగించడం సమంజసం కాదు. కొత్తవారిని ప్రోత్సహించడానికి, జట్టులోని ఇతరులకు అన్యాయం చేయడానికి మధ్య చాలా చిన్న గీత ఉంటుంది' అని కొటక్ పేర్కొన్నారు. ప్రతిభకు కచ్చితంగా తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని, కానీ జట్టు సమతూకం, నిలకడైన ప్రదర్శనలకే తొలి ప్రాధాన్యతనిస్తామని మేనేజ్‌మెంట్ తేల్చిచెప్పింది.

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం!

అరుదైన రికార్డు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy