Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?

తుర్కియే మిలిటరీ విమానాల్లో డ్రోన్స్ తరలింపు?

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా తుర్కియే దేశ మిలిటరీ విమానాలు పాక్‌కు రాకపోకలు సాగిస్తుండటం పలు సందేహాలు లేవనెత్తుతోంది. తుర్కియే పాక్‌కు డ్రోన్స్‌ను సరఫరా చేస్తోందా?

అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత 60 గంటల్లో పలు తుర్కియే మిలిటరీ విమానాలు రావల్పిండికి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు, కరాచీలోని మస్రూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు వచ్చి వెళ్లాయి. ముఖ్యంగా రవాణాకు ఉపయోగించే సీ-130 హర్క్యూలీస్ విమానాలు ఈ రాకపోకలు సాగించాయి. అయితే, ఇవి సాధారణమైన రాకపోకలు కావని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డ్రోన్స్, ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను తుర్కియే పాక్‌కు పంపించి ఉండొచ్చని సమాచారం.

పాక్ తన వైమానిక దళాన్ని ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తోంది. అధిక సంఖ్యలో డ్రోన్స్, ఇతర ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకూ తుర్కియే పాక్‌కు బైరక్తార్ టీబీ2 డ్రోన్స్‌ను సరఫరా చేస్తూ వచ్చింది. మధ్యశ్రేణి ఎత్తున ప్రయాణించే ఈ డ్రోన్స్ టాక్టికల్ దాడులకు వినియోగిస్తారు. ఈ డ్రోన్స్‌తో ఉక్రెయిన్ రష్యాను టార్గెట్ చేసింది. రష్యా ఆర్టిలరీ, నౌక దళాలను ధ్వంసం చేసింది. డ్రోన్స్‌తో పాటు హెచ్‌క్యూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్‌కు సరఫరా చేసి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇదే నిజమైతే పాక్ డ్రోన్ దాడుల సామార్థ్యాలు భారీగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా పాక్ తన డ్రోన్‌లను సమకూర్చుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. తుర్కియే, సౌదీ అరేబియాలతో కుదిరిన రక్షణ రంగ సహకార ఒప్పందంలో భాగంగా పాక్ ఈ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy