Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే సీఎంను కలుస్తా: ప్రొఫెసర్‌ కాశీం

త్వరలోనే సీఎంను కలుస్తా: ప్రొఫెసర్‌ కాశీం

ములుగు, మే 24: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో కలుస్తానని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చింతకింది కాశీం చెప్పారు. చిన్నచిన్న కేసుల కారణంగా అనేకమంది జైలు జీవితం గడుపుతున్నారని, వారి దుర్భర జీవితం గురించి సీఎంకు వివరిస్తానన్నారు. గతంలోలా జీవిత ఖైదీలకు ఏడాదికి ఒకసారి క్షమాభిక్ష ప్రసాదించాలని, ఖైదీల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని కోరుతానని చెప్పారు. జైలులో ఉన్నవారికి విముక్తి కి తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

షరతులతో కూడిన బెయిలుపై ఇటీవలే కాశీం జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ములుగు పోలీ్‌సస్టేషన్‌లో సంతకం చేసేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

తన విడుదలకు ఉద్యోగ, ప్రజా సంఘాలు, ప్రజలు కృషి చేశారని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy