Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్విన్స్‌ను పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పెళ్లి జరిపించిన పాస్టర్లు కూడా ట్విన్స్..

ట్విన్స్‌ను పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పెళ్లి జరిపించిన పాస్టర్లు కూడా ట్విన్స్..

ఇంటర్‌నెట్ డెస్క్: కేరళలోని కొట్టాయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అరుదైన పెళ్లి వేడుక ఒకటి జరిగింది. ట్విన్స్‌ను ట్విన్స్ పెళ్లి చేసుకోగా.. వారికి ట్విన్ పాస్టర్లు పెళ్లి జరిపించారు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంగనస్సేరి ప్రాంతానికి చెందిన అఖిల్ కే థామస్, నిఖిల్ కే థామస్ అనే ట్విన్ బ్రదర్స్‌కు.. అదే ప్రాంతానికి చెందిన మ్యాగీ మేరీ థామస్, మ్యారియా మేరీ థామస్ అనే ట్విన్ సిస్టర్స్‌తో పెళ్లి నిశ్చయం అయింది. గురువారం చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చ్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది.

అఖిల్ కే థామస్.. మ్యాగీ మేరీ థామస్‌ను పెళ్లి చేసుకున్నాడు. నిఖిల్ కే థామస్.. మ్యారియా మేరీ థామస్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ట్విన్ పాస్టర్లు ఆంటో ఫెజుమ్‌కట్టిల్, అజో ఫెజుమ్‌కట్టిల్ వీరికి పెళ్లి జరిపించారు. ట్విన్ బ్రదర్స్ అయిన జేరన్ జేమ్స్, జోహన్ జేమ్స్ పాస్టర్లకు పెళ్లి జరిపించటంలో సాయం చేశారు. ట్విన్స్‌తో పెళ్లి మండపంలో సందడి నెలకొంది. వధువులు ఈ పెళ్లి గురించి మీడియాతో మాట్లాడుతూ..

'ట్విన్స్ మధ్యలో మా పెళ్లి జరగాలని చిన్నప్పటినుంచి కలలు కంటున్నాం. మా తల్లిదండ్రులు, బంధువులు కూడా ఇదే కోరుకున్నారు. దేవుడు మా కల నెరవేరేలా చేశాడు. మేము ఇంటర్‌నెట్‌లో ట్విన్ పాస్టర్ల కోసం వెతికాము. వారికి ఫోన్ చేసి విషయం చెప్పాము. వారు వెంటనే పెళ్లి చేయడానికి అంగీకరించారు. ట్విన్ పాస్టర్లు పెళ్లి జరిపించటం చాలా ప్రత్యేకమైన విషయం. ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇస్తుంది' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

>

కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలను ప్రశంసించిన ప్రధాని మోదీ

ఇథనాల్ బ్లెండింగ్ లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది: కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy