Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మానస పథకం: తులసిరెడ్డి

ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మానస పథకం: తులసిరెడ్డి

విజయవాడ: ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మానస పథకమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ఉచిత విద్యుత్‌పై దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. అరశాతం అప్పుకోసం అన్నదాతలకు అన్యాయం చేయొద్దని సూచించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడమంటే.. రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమేనని అన్నారు. కేంద్రం ఒత్తడికి తలొగ్గి మీటర్లు బిగించొద్దన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడదని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy