Dailyhunt
ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు..

ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు..

దయం లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం నష్టాల్లోకి ప్రవేశించాయి. క్రూడాయిల్ ధరలు ఏడు నెలల గరిష్ఠానికి చేరడం, ఎఫ్‌ఎమ్‌సీజీ, మెటల్, రియాల్టీ రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు కిందకు దిగి వచ్చాయి.

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు కూడా మదుపర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సెనెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా రోజును ముగించాయి (Indian stock market).

గత సెషన్ ముగింపు (82,276)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 220 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగిసింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో కిందకు దిగి వచ్చింది. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే మధ్యాహ్నం తర్వాత 500 పాయింట్లు పడిపోయింది. చివరకు 27 పాయింట్ల నష్టంతో 82,248 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 25,496 వద్ద స్థిరపడింది (stock market news today).

సెన్సెక్స్‌, నిఫ్టీలో మ్యాన్‌కైండ్ ఫార్మా, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, ఒరాకిల్ ఫిన్‌సర్వ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). సమ్మన్ క్యాపిటల్, డిక్సన్ టెక్నాలజీస్, సీడీఎస్‌ఎల్, కేఫిన్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫైనాన్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 392 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.91గా ఉంది.


రెండో పెళ్లి చేసుకుంటా: పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy