Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన: బండి సంజయ్‌

ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన: బండి సంజయ్‌

సిరిసిల్ల: ఇంటికో ఉద్యోగం ఇవ్వకపాయే... నిరుద్యోగ భృతి ఏమాయే? అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా విద్యావంతులైన యువతీ, యువకులను మోసగించారని అన్నారు.

తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు ఉపాధి కల్పించడం కోసం కాదన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఎందరో యువతీ యువకులు అశలు పెట్టుకున్నారని కానీ వారి అశలు అడియాశలు అయ్యాయని అన్నారు. ఉద్యోగాలు దొరక్క యువతీ, యువకులు ఆవేదన చెందుతున్నారని అనేక చోట్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని బండి సంజయ్‌ ప్రకటించారు.

బీజేపీ మతతత్వ పార్టీయే..నేను మతతత్వ వాదినే: సంజయ్  TRS-BJP ఒకటే.. కిషన్ రెడ్డికి సవాల్..!  దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలి: కేసీఆర్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy