Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 27 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని జిల్లా ఉద్యోగుల జాక్‌ చైర్మన్‌ ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ జబీలు డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జాక్‌) అధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్‌లతో ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన పీఆర్‌సీ, పాతపెన్షన్‌ పునరుద్ధరణ, బకాయి ఉన్న అరు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే పెండింగ్‌ బిల్లులు చెల్లించడంతో పాటు హెల్త్‌ కార్డులను జారీ చేయాలన్నారు.

ప్రభుత్వం స్పందించ కుంటే సెప్టెంబర్‌ 10వ తేదీన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టి పోరాటాలు ప్రారంభిస్తామ న్నారు. పెండింగ్‌ బిల్లులు 10వేల వరకు పెరిగి పోయాయన్నారు. పదవీవిరమణ పొందిన వారి కష్టాలు వర్ణణాతీతమన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండడం రాష్ట్ర చరిత్రలో ఎప్పడూ లేదన్నారు. జూన్‌ 2నాటికి అరోగ్య కార్డులు జారీ చేస్తామని నేటికి నెర వేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో జాక్‌ నాయకులు గాజుల సుదర్శన్‌, బొల్గం సాగర్‌, మెట్ట శ్రీకాంత్‌, మహమ్మద్‌ రియాజ్‌, జీ శ్రీనివాసరావు, డుమాల రామ్‌నాథ్‌రెడ్డి, మధుసూదన్‌రావు, సదానందం, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, హరికిషన్‌, నయిమోద్దీన్‌, లాల శ్రీనివాస్‌, మోతీలాల్‌, పురుషోత్తం, బుర్ర కృష్ణప్రసాద్‌, కొమ్ము రమేష్‌, సాయి కిరణ్‌, విశ్వాస్‌, రామస్వామి, సురేష్‌, ప్రవీణ్‌, అనిల్‌, మహేం దర్‌రావు, శ్రీనివాస్‌, శివసాయి, అర్‌ శేఖర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy