తెలంగాణ తాజావార్తలు
ఉద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: చిన్నారెడ్డి

హైదరాబాద్: ఉద్యోగులతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడారు. ఉద్యోగులు 63% ఫిట్‌మెంట్ అడిగితే 7.5 % ఇస్తారా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. గతంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే 35% ఫిట్‌మెంట్ ఇచ్చారని చిన్నారెడ్డి తెలిపారు. 43% కంటే 10% ఎక్కువ ఫిట్‌మెంట్ ఇస్తేనే మంచిదని ఆయన సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
తెలంగాణ దేశాభివృద్ధిలో పీవీదే కీలకపాత్ర
-
జిల్లా వార్తలు అట్టహాసంగా 3కె రన్
-
హెరాల్డ్ కార్డ్స్ మాస్క్ లేకపోతే బిల్ వేయను అనడంతో అండర్ వేర్ ని తీసేసి మాస్క్ లా పెట్టుకున్న...