Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉక్కు పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

ఉక్కు పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 27: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు.

ప్లాంట్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, వై.మస్తానప్ప, కొమ్మినేని శ్రీనివాసరావు, వరసాల శ్రీనివాస్‌, జె.సింహాచలం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy