Friday, 22 Jan, 2.51 am ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
ఉక్రెయిన్ నర్సింగ్ హోంలో అగ్ని ప్రమాదం.. 15మంది సజీవ దహనం..

మాస్కో: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో ఓ ప్రయివేటు ఆస్పత్రి మంటల్లో చిక్కుకోవడంతో 15 మంది ప్రాణాలు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. రెండంతస్తుల ఈ భవనంలో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. వాస్తవానికి ఆ ఆస్పత్రిని ఇంటికోసం నిర్మించారనీ... తర్వాత నర్సింగ్ హోమ్‌గా మలిచారని స్థానిక మీడియా వెల్లడించింది. ఆస్పత్రి నిర్వహణ కోసం దాన్ని రిజిస్టర్ చేశారా లేదా అనేదానిపైనా స్పష్టత లేదని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై భవనం యజమాని, అందులో పనిచేస్తున్న సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు ది ఇంటర్‌ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top