నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 22: ఉపాధిహామీ పనుల్లో కరోనా నిబంధనలు తప్పనిసరి పాటించాలని డీఆర్‌డీ వో పీడీ చందర్‌నాయక్ సూచించారు. గురువారం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ... వేసవి దృష్ట్యా పనులకు వచ్చేవారికి తగిన వసతులు కల్పించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యవంతులను మాత్రమే పనుల్లో తీసుకోవాలని ఆదేశించారు. ఎవరు ఒత్తిడితెచ్చినా లెక్కచేయవద్దని, నిబంధనల ప్రకారమే కూలీల సంఖ్యను పెంచాలని అ న్నారు. గ్రామాల్లో పల్లెపగ్రతి పనులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎం.మల్లేష్, ఏపీఎం మదురిమ, ఏపీవో పద్మ తదితరులు పాల్గొన్నారు.
కేకేతండా వెంగల్‌పహాడ్‌లో పనుల పరిశీలన..
ఇందల్‌వాయి: మండలంలోని కేకేతండా వెంగల్‌పహాడ్ గ్రామాలలో గురువారం పీఆర్‌డీవో పీడీ చందర్‌నాయక్ అ భివృద్ధి పనులను పరిశీలించారు. రెండు గ్రామాల్లోని పల్లె ప్రకృతివనం, నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్‌షెడ్ పనుల ను పరిశీలించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం సూచిస్తున్న విధంగా కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు 220 రూపాయల కూలి వస్తుందన్నారు. రోజురోజుకూ కరోనా తీ వ్రస్థాయిలో పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కుల ను ధరించి భౌతికదూరం పాటిస్తూ పనులు చేయాలన్నా రు. నర్సరీలో మొక్కల పెంపకంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల ని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాములునాయక్, ఏపీవో మంజుల, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన పీడీ..
డిచ్‌పల్లి: ఎస్‌బీఐ శిక్షణ సంస్థ ద్వారా ఆర్థిక స్వయం స మృద్ధి కోసం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మగ్గం వర్కు నేర్చుకుంటున్న యువతులు శిక్షణ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించగల్గుతారని డీఆర్‌డీఏ పీడీ చందర్‌నాయక్ తెలిపా రు. గురువారం డిచ్‌పల్లిలోని ఎస్‌బీఐ గ్రామీణ ఉపాధి శిక్ష ణ కేంద్రాన్ని ఆయన సందర్శించి శిక్షణ నేర్చుకుంటున్న ట్రై నర్స్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. శిక్షణ నేర్చు కుంటున్న మహిళలు ఆర్థికాభివృద్ధి కోసం స్వయం ఉపాధి శిక్షణలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. పరిస్థితు లకు అనుగుణంగా ఎంబ్రాయిడింగ్ శిక్షణాలు యువతులు నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ప్రతీఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉ పయోగపడుతయన్నారు. శిక్షణలో ఉన్న యువతులు చేస్తు న్న వర్కును చూసి పీడీ సంతోషం వ్యక్తం చేశారు. అనంత రం కరోనా పరిస్థితులను అధిగమించి కేంద్రంలో తీసుకుం టున్న జాగ్రత్తలు చూసిన పీడీ సంస్థ డైరెక్టర్ సుదీంద్ర బా బును ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా శిక్షణ కేం ద్రం సందర్శించిన పీడీని సన్మానించారు.

