Dailyhunt
ఉపాధితో మారుతున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం: వీఏంఆర్‌డీఏ చైర్మన్

ఉపాధితో మారుతున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం: వీఏంఆర్‌డీఏ చైర్మన్

విశాఖపట్నం, ఏప్రిల్ 26: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో విశాఖపట్నం ఏఐ హబ్‌గా మారుతుందని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఏంఆర్‌డీఏ) చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు.

ఆదివారం విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రాకతో వేలాది ఉపాధి అవకాశాలకు తెర తీస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో యువత అంతా పండగ చేసుకుంటుందన్నారు. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రపంచపటంలో విశాఖపట్నం మేరిసెలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. గతంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర.. ఈ ఉపాధితో ఉత్తమ ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురం అనుసంధాన రహదారులు జులై నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తర్లువాడకు అనుసంధాన రహాదారులు సిద్ధం చేశామన్నారు. అనకాపల్లిలో ఆర్సీలార్ మిట్టల్, రెన్యూ సంస్థల రాకతో రాంబిల్లి, భోగాపురం అనుసంధానించే రింగ్ రోడ్డు డీపీఆర్ సిద్ధమైందని ప్రణవ్ గోపాల్ చెప్పారు. గత ఐదేళ్లలో ఒక్క రహదారి కోసం కనీసం మట్టి వేసిన పాపాన పోలేదంటూ గత వైసీపీ ప్రభుత్వంపై ప్రణవ్ గోపాల్ నిప్పులు చెరిగారు.

ఇంధన సరఫరాలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి: మంత్రి నాదెండ్ల

కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి

For More TG News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy