Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపేంద్ర 'కబ్జా' మోషన్ పోస్టర్ విడుదల

ఉపేంద్ర 'కబ్జా' మోషన్ పోస్టర్ విడుదల

ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ఎస్‌ఎస్ఈ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎమ్‌టిబి నాగరాజు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియన్ చిత్రం 'కబ్జా'.

ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆర్ చంద్రశేఖర్ నిర్మాత. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను దర్శకనిర్మాతలు విడుదల చేశారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఉపేంద్ర పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఉపేంద్ర ఇచ్చిన లుక్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్ర టీజర్‌ని దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy