Dailyhunt

'ఉర్దూ వర్సిటీ'కి 9వరకు దరఖాస్తులు

రాయదుర్గం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంట్రన్స్‌ పరీక్షల ఆధారంగా అడ్మిషన్‌ లభించే కోర్సులకు ఆగస్టు 9వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మెరిట్‌ ఆధారంగా ప్రవేశం పొందే కోర్సులకు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్‌, ఎంఎడ్‌, డీఈఈడీ, పాలిటెక్నిక్‌, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy