Dailyhunt
వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు

వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు

భోపాల్: ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 10న జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

దేశ ప్రతిష్టను దిగజార్చే చర్చలకు కాంగ్రెస్ పాల్పడిందంటూ ఈ ఘటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, తాజాగా ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. ఐవైసీ కర్యకర్తలను అత్యంత ధైర్యవంతులైన సింహాలుగా (Babbar-Sher) అభివర్ణించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు.

'షర్ట్‌లెస్' నిరసనలకు సంబంధించి యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో 15 గంటలకు పైగా విచారణ జరిపి అరెస్టు చేశారు. ఆనంతరం ఆయనకు పాటియాల హౌస్ కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. కాంగ్రెస్ నిరసనలకు ప్రధాన సూత్రధారి చిబ్ అని, ఇది జాతీయ భద్రత, దేశ స్వారభౌమాధికారం, సమగ్రతకు చెందని కేసు అని పోలీసులు చెబుతున్నారు. దీనిపై భోపాల్‌లో జరిగిన కిసాన్ మహాచౌపల్‌లో రాహుల్ గాంధీ స్పందించారు.

'యూత్ కాంగ్రెస్ సభ్యులంతా బబ్బర్ షేర్‌లు. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీలో దేశభక్తి రక్తం ఉంది. మీరు హరిత విప్లవం తీసుకువచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ విప్లవం తెచ్చారు. వీటన్నింటికీ మోదీ చరమగీతం పాడారు' అని రాహుల్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy