Dailyhunt
వామ్మో..  పానీ పూరీ వాలా! ఇతడి ముందు టెకీలు కూడా దిగదుడుపే

వామ్మో.. పానీ పూరీ వాలా! ఇతడి ముందు టెకీలు కూడా దిగదుడుపే

ఇంటర్నెట్ డెస్క్: స్ట్రీట్ ఫుడ్ అంటే భారత్‌లో అధికశాతం మందికి ముందుగా గుర్తుకు వచ్చేది పానీ పూరీనే. ఈ పేరు చెబితే చాలు జనాలకు నోరు ఊరుతుంది. ఇంతటి ఆదరణ ఉన్న ఈ ఫుడ్‌ను అందించే పానీ పూరీ వాలాల సంపాదన కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కేసీ పరేరా అనే కంటెంట్ క్రియేటర్ ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేశారు. పానీ పూరీ స్టాల్‌ను నిర్వహిస్తున్న ఒక వ్యక్తి నెలకు రూ.90 వేల వరకూ సంపాదిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఆ పానీ పూరీ స్టాల్ ఓనర్ రోజుకు దాదాపు 100 ప్లేట్‌ల వరకూ పానీ పూరీలను విక్రయిస్తాడని చెప్పుకొచ్చారు. ప్లేట్‌కు రూ.30 చొప్పున తీసుకుంటారని కేసీ తెలిపారు. ఆ లెక్కన రోజుకు అతడి సగటు సంపాదన రూ.3 వేల వరకూ ఉంటుందని ఆశ్చర్యపోతూ చెప్పారు. అంతేకాకుండా, పానీ పూరీలను ఎలా చేయాలో కూడా కంటెంట్ క్రియేటర్ అక్కడ నేర్చుకున్నారు.

ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పానీ పూరీ వాలా వ్యాపార దక్షతను అనేక మంది ప్రశంసించారు. మరికొందరు మాత్రం పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రతి నెలా అదే స్థాయిలో ఆదాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ షాపు ఓనర్ అయినా సగటు బీకామ్ పట్టభద్రుడి కంటే ఎక్కువే సంపాదిస్తారని మరికొందరు అన్నారు. హోటల్ వ్యాపారంలో మంచి ఆదాయం పొందవచ్చని అన్నారు. నిబద్ధత, కృషి ఉంటే ఇలాంటి ఫుడ్ స్టాల్స్‌తో సగటు ఉద్యోగి కంటే ఎక్కువే సంపాదించవచ్చని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy