అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (గురువారం) సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా కేబినెట్‌లో చర్చించారు. ఏపీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించినట్లు సమాచారం. సూర్యఘర్, పీఎం కుసుంను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
దేశాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత..
దేశాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాన్వాయ్‌ల తగ్గింపుతో సరిపోదని.. మరిన్ని పొదుపు చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పిద్దామని తెలిపారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని సూచించారు. అవసరమైతే సెక్రటేరియట్‌కి సైకిల్ మీద రావాలని మార్గనిర్దేశం చేశారు. సంక్షోభ నిర్వహణ అందరికీ రావాలని సూచించారు. సంక్షోభాన్ని మేనేజ్ చేయడం అందరు తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులకు బాధ్యత ఉంటుందని తెలిపారు. దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పారు. అందరం కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని అన్నారు. ఇంకా ఇతర పొదుపు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాడే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేదా.. ఈవీ, సైకిల్ వినియోగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అధిక సంఖ్యలో సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించాలని తెలిపారు. ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

