Dailyhunt

వారాంతపు, మేకల సంతల రద్దు పొడిగింపు

నవీపేట, ఏప్రిల్‌ 22: నవీపేటలో ప్రతీ శుక్రవారం జరి గే వారాంతపు, శనివారం జరిగే మేకల సంతలను ఈ వా రం కూడా రద్దు చేశామని పంచాయతీ కార్యదర్శి సందీప్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నవీపేటలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సంతల రద్దును పొడిగించినట్లు పేర్కొన్నారు. వ్యా పారులు ఎవరు కూడా సంతలకు రావద్దని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy