Dailyhunt
వారణాసిలో కేసీఆర్‌ ఫ్యామిలీ

వారణాసిలో కేసీఆర్‌ ఫ్యామిలీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబం వారణాసిలో పర్యటిస్తోంది. రెండు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ ఆలయాలను కేసీఆర్ ఫ్యామిలి దర్శించుకుంటుందని చెబుతున్నారు. వారణాసి పర్యటనలో కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు బీజీబీజీగా నడిపారు. అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోటులో ప్రయాణించారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగానదికి కేసీఆర్ సతీమణి శోభ, కవిత హారతి ఇచ్చారు. అనంతరం ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో శోభ, కవిత ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సంకట్‌మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy