Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి!

వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి!

హైదరాబాద్: తెలంగాణలో ఢిల్లీ తరహా సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం. వారం పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 50 శాతం అక్యుపెన్సికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్లు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సడలింపులపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల సడలింపు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy