ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడని..
అతడే భారత క్రికెట్ భవిష్యత్ అని వ్యాఖ్యానించాడు. అయితే అంత చిన్న వయసులోనే అతడిని జట్టులోకి తీసుకురావడంలో తొందరపడకూడదని సూచించాడు. అవకాశాలు వచ్చినప్పుడు వైభవ్ వాటిని సద్వినియోగం చేసుకుంటాడని జయసూర్య పేర్కొన్నాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
'వైభవ్ సూర్యవంశీ భిన్నమైన ప్రతిభ కలిగిన ఆటగాడు. భారత క్రికెట్ భవిష్యత్ అతడే. అతడి ముందు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి వైభవ్‌కు అవకాశాలు ఇవ్వండి. వైభవ్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ అవకాశాలు వచ్చినప్పుడు అతడు వాటిని అందిపుచ్చుకుంటాడు. వైభవ్ జట్టులోకి రావాలంటే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు కూడా తమ స్థానాలను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో ప్రతిభకు కొదవలేదు. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ఎంతో కష్టపడతారు. ఎవరైనా విఫలమైతే వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ఆటగాడు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. భారత క్రికెట్ ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వన్డే, టీ20, టెస్టు.. మూడు ఫార్మాట్లలోనూ ఆడటం అంత సులభం కాదు. దేశం తరఫున ఆడాలనే భారత ఆటగాళ్లలోని ఆసక్తి, కష్టపడే తత్వమే వారి విజయానికి కారణం' అని జయసూర్య వెల్లడించాడు.
strong>
ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ
న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?

