Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బద్దలు

వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బద్దలు

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే దులీప్‌ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధ శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

దీంతో 57 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సెంట్రల్‌ జోన్‌తో ఈస్ట్‌ జోన్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సోమవారం బ్యాటింగ్‌కు దిగిన వైభవ్‌ తనదైన దూకుడుతో విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. అయితే సెంచరీకి చేరువైన వైభవ్‌(92).. మరో 8 పరుగుల దూరంలోనే పెవిలియన్‌కు చేరాడు.

57 ఏళ్ల రికార్డు బద్దలు

దులీప్‌ ట్రోఫీలో అతి చిన్న వయసులో అర్ధ శతకం సాధించిన రికార్డు ఇంతకాలం లక్ష్మణ్‌ సింగ్‌ పేరిట ఉంది. 1969లో అతడు 16 ఏళ్ల 23 రోజుల వయసులో దులీప్‌ ట్రోఫీలో తొలి అర్ధ శతకం సాధించాడు. తాజాగా వైభవ్‌ ఆ రికార్డును అధిగమించాడు. అతడి తర్వాతి స్థానంలో పీయూష్‌ చావ్లా ఉన్నాడు. 2025లో 16 ఏళ్ల 307 రోజుల వయసులో చావ్లా దులీప్‌ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ జట్టు 266 పరుగులకు ఆలౌటైంది. రింకు సింగ్(60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టు 35 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కుమార కుషాగ్రా(0) విఫలమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ(92) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ వార్త రాసే సమయానికి క్రీజులో అభిమన్యు ఈశ్వరన్(62*), సుదీప్ కుమార్(17*) ఉన్నారు. సెంట్రల్ జోన్ కంటే ఈస్ట్ జోన్ ఇంకా 77 పరుగుల వెనుకంజలో ఉంది.

strong>

యూఎస్ ఓపెన్: టోర్నీ నుంచి జకోవిచ్ ఔట్.. కోర్టులోనే కన్నీళ్లు!

శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy