స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతకం సాధించాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. గతంలో జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు.
250 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్ల తర్వాత భారత్ 162/2 స్కోరును నమోదు చేసింది. సూర్యవంశీ, రింకు సింగ్ క్రీజులో ఉన్నారు. సూర్యవంశీ 16 బంతుల్లో తన అర్ధ సెంచరీని, 28 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలానే 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన వైభవ్.. యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ద్విశతకం సాధించిన అనంతరం తొలి బంతికే వైభవ్ ఔటయ్యాడు. భారత్ సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకోవడానికి భారీ తేడాతో గెలవాలని కసితో ఆడుతోంది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 144 బంతుల్లో 130 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ నాలుగు వికెట్లు సాధించాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

