Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమా.. జట్టు కూర్పు ఇలా ఉంటుందా..

ఇంటర్నెట్ డెస్క్: పదిహేనేళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడిని బెంచ్‌కే పరిమితం చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు.

అయితే వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని అభిమానుల నుంచే కాదు.. మాజీ క్రికెటర్ల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి (Vaibhav Sooryavanshi debut).

వైభవ్‌ను ఎక్కువ కాలం బెంచ్‌కే పరిమితం చేస్తే అతడిపై ఒత్తిడి పెరగడం ఖాయమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, జులై 4వ తేదీన మాంచెస్టర్‌లో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. జట్టులో కొన్ని కీలక మార్పులు చేసి వైభవ్‌ను ఆడించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాంచెస్టర్ టీ20లో అభిషేక్‌తో పాటు వైభవ్‌ను ఓపెనింగ్‌కు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెనర్‌గా ఆడుతున్న సంజూ శాంసన్‌ను మూడో స్థానంలో పంపుతారని సమాచారం (India vs England).

ఇక, ఇషాన్ కిషన్‌ను నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట (Team India Playing XI). బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు స్పిన్ విభాగంలో కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు విశ్రాంతినిచ్చి, అదనపు బౌలర్‌ను బరిలోకి దించే విషయాన్ని జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్నట్టు సమాచారం. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలిగే వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట.


బంగారం ధరలు మరింత కిందకు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy