Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దేందుకు భారత యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జింబాబ్వేతో రెండో టీ20కి ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి వైభవ్ భవిష్యత్తు గురించి మాట్లాడాడు.

జింబాబ్వేతో తొలి టీ20లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టామని, అవకాశం వస్తే బౌలింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపాడు.

'ముందుగా వైభవ్ బ్యాటింగ్‌ను మెచ్చుకోవాలి. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్స్ నుంచి ఈ మైదానం అతడికి బాగా కలిసొచ్చింది. ప్రశాంతంగా, సునాయాసంగా పరుగులు సాధిస్తున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE)లో అతడి బౌలింగ్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. అతడు బౌలింగ్‌లోనూ కుదురుకుంటే జట్టుకు మరింత ప్రయోజనకరంగా మారుతాడు' అని సునీల్ జోషి తెలిపాడు.

సూర్యాంశ్ షెడ్గేపై ఒత్తిడి వద్దు

యువ సీమ్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో పోల్చడం సరికాదని జోషి స్పష్టం చేశాడు. 'అంతర్జాతీయ స్థాయికి అలవాటు పడేందుకు యువ ఆటగాళ్లకు కొంత సమయం పడుతుంది. సూర్యాంశ్ ఇప్పుడిప్పుడే భారత జట్టులో తన స్థానాన్ని స్థిరపరుచుకుంటున్నాడు. అతడిలోని ప్రతిభను నమ్మి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్ష్ దూబె వంటి ప్లేయర్లకు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది. ధారాళంగా పరుగులు ఇవ్వకుండా నియంత్రణతో బౌలింగ్‌లో చేసేలా వారితో నిరంతరం చర్చిస్తున్నాం' అని జోషి వెల్లడించాడు.

strong>

షమీని ఎవ్వరూ పట్టించుకోని స్థితికి తీసుకొచ్చారు: క్రిస్ శ్రీకాంత్

కామన్వెల్త్ గేమ్స్: భారత్‌కు తొలి పతకం.. ఝండూ కుమార్‌కు మోదీ అభినందనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy