Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె

వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యంత పిన్న వయసులోనే అరంగేట్రం చేసి తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు.

అయితే విదేశీ పర్యటనల్లో వైభవ్ తల్లిదండ్రులకు కూడా అనుమతి ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అక్కడి వాతావరణం, క్రికెట్ ఆడే క్రమంలో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే వైభవ్ భవిష్యత్తు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదని తెలిపాడు. భవిష్యత్తులో వైభవ్ విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర అని తెలిపాడు.

'వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు మార్గనిర్దేశం అవసరం. అతడి భవిష్యత్తు విజయాల్లో కుటుంబానిదే అత్యంత కీలక పాత్ర. పేరు, ప్రఖ్యాతి, వరుస ప్రయాణాలు, చుట్టూ ఉండే వ్యక్తుల ప్రభావం వైభవ్‌పై పడకుండా కుటుంబ సభ్యులే అతడిని క్రమశిక్షణలో పెట్టాలి. పదేళ్ల తర్వాత కూడా అతడి కెరీర్ సాఫీగా సాగాలంటే తల్లిదండ్రులు సరైన దిశలో నడిపించాలి. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునేంత ఎదుగుదల వైభవ్‌లో ఉండకపోవచ్చు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. వైభవ్ టెస్టు క్రికెట్ ఆడుతాడా? ఆ ఫార్మాట్‌లో రాణించగలడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడే అలాంటి వ్యాఖ్యలు చేసి యువ ప్లేయర్‌పై అనవసర ఒత్తిడి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. ఐపీఎల్, అంతర్జాతీ క్రికెట్ రెండూ పూర్తిగా భిన్నం. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో ఒత్తిడి కూడా వేరుగా ఉంటుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీని ప్రశాంతంగా ఉండనివ్వండి. అతడి సహజ శైలిలోనే ఎదగనివ్వండి' అని రహానె వెల్లడించాడు.

15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్-2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం భారత జట్టులో చోటు దక్కించుకుని జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రెండు అర్ధ శతకాలతో మొత్తం 151 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.

strong>

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy