నిజామాబాద్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య సేవలకు కావాల్సిన ఏ ర్పాట్లపై ఎమ్మెల్సీ కవిత దృష్టిపెట్టారు. జిల్లాలో నెల రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరిగింది. కేసులు ఎక్కువ కావ డం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎక్కువ మంది వచ్చి చేరుతుండడంతో సౌకర్యాలపై దృష్టిపెట్టారు. మంత్రులతో జిల్లా ప్ర జాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ రోగులకు ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం కలెక్టర్ నారాయణరెడ్డి, వైద్య అధికారులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అత్యవసరమైన రెమ్‌డెసివిర్ మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
