Saturday, 21 Sep, 1.43 pm ఆంధ్రజ్యోతి

ఆంధ్ర తాజా వార్తలు
వైఎస్ ధనయజ్ఞం గుర్తొస్తోంది: ఆలపాటి రాజా

గుంటూరు: సీఎం జగన్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో వైఎస్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన విషయం గుర్తొస్తోందన్నారు. గతంలో పనులు బాగా చేసిన గుత్తేదార్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లటం సరికాదన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనుల వేగంలో గిన్సిస్ రికార్డు సాధించినట్లు గుర్తుచేశారు. దేశంలోని మిగతా 15 జాతీయ ప్రాజెక్టుల కంటే పోలవరం వేగంగా పనులు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు ఒక్క శాతం పనులు కూడా సరిగా చేయని మాక్స్ ఇన్‌ప్రాకు టెండర్లు కేటాయించారని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అర్హత లేని గుత్తేదార్లను హెడ్ వర్క్స్ పనులు కట్టబెడుతున్నారని తెలిపారు. మరి ప్రాజెక్టు నాణ్యతకు ఎలాంటి హామీ ఇస్తారని అడిగారు. ఎక్కడా అవినీతి జరగలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిందన్నారు. అయినా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అర్హత లేని వారికి కాంట్రాక్టు ఇస్తోందన్నారు. కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి ప్రాజెక్టు ఆలస్యానికి కారణమయ్యారన్నారు. ఇది రివర్స్ టెండరింగ్ కాదు రిజర్వు టెండర్ అని వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top