Dailyhunt
వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే టీడీపీ గెలవాలి: చంద్రబాబు

వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే టీడీపీ గెలవాలి: చంద్రబాబు

విజయవాడ: నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...అమరావతి నాకోసం కాదు.. ప్రజల కోసమన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. అమరావతి ఆంధ్రుల హక్కుపై ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు. అమరావతి కోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని సూచించారు. అమరావతి కోసం ఇంటికొక్కరు బయటకు రావాలని చెప్పారు. పట్టిసీమ నీటి లబ్ధిదారులు ఆలోచించాలన్నారు. ఇక్కడి మంత్రికి దుర్గమ్మపై భయం, భక్తి లేదని మండిపడ్డారు. విజయవాడ మేయర్‌గా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే టీడీపీ గెలివాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy