Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలకు బాధ్యులెవరు?: మంత్రి ఆనం

వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలకు బాధ్యులెవరు?: మంత్రి ఆనం

నెల్లూరు, నవంబర్ 24: వైసీపీ నేతలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ..

రేణిగుంట ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయంపై వైసీపీ అనవసర వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆలయాన్ని తొలగిస్తున్నారంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నాలుగు లైన్ల విస్తరణలో భాగంగానే ఆలయ భూమి సేకరణ చేపట్టామని వివరించారు. ఆలయానికి సంబంధించిన 10 సెంట్ల భూమికి రూ.59.30 లక్షల పరిహారం నిర్ణయించామని ఆయన తెలిపారు.

ఆలయాన్ని తరలించేందుకు సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం బాలాలయం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ నుంచి అదనంగా 50 సెంట్ల స్థలం సేకరించామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధమైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలకు బాధ్యులు ఎవరంటూ ఆ పార్టీ నేతలను నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. దేవాలయాల విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ నేతలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy