Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ హయాంలో ఎన్నో అపచారాలు

వైసీపీ హయాంలో ఎన్నో అపచారాలు

  • గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు

విజయనగరం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): 'గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అపచారాలు జరిగాయి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని, రసాయనాలేనని సమర్థించుకున్నారు' అని గోవా గవర్నర్‌ పూసపాటి ఆశోక్‌గజపతిరాజు విమర్శించారు.

గురువారం విజయనగరంలో పైడిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. 'అప్పట్లో నా ఇంటి గేటుకు తాళాలు వేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇంకా నయం రఘురామకృష్ణరాజులా నన్ను కొట్టి, ఆసుపత్రికి పంపలేదు...

సంతోషం. ఆ దేవుడే నన్ను కాపాడాడు. కసాయివారికీ మనసు ఉంటుంది. కానీ గత ప్రభుత్వాలకు అది లేదు. రాక్షసుల కన్నా దారుణంగా, హీనంగా ప్రవర్తించారు. మూర్ఖులకు మంచి మనస్సు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నా' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy