Dailyhunt
వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ: గోరంట్ల

వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ: గోరంట్ల

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ జీవో విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు హైకోర్టులో ఏవిధంగా పాలకులకు గుణపాఠాలు ఎదురవుతున్నాయో చూస్తున్నామన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలాగానే గతంలో అనేక అంశాల్లో న్యాయస్థానం ప్రభుత్వానికి చీవాట్లుపెట్టిందన్నారు. కోట్లాదిరూపాయలను లీగల్ అడ్వయిజర్లు, ఏజీపీల పేరుతో దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు ఫలితం ఈ తీర్పు అని హర్షం వ్యక్తం చేశారు. సక్రమంగా, ధర్మబద్ధంగా సాగుతున్న హిందూధార్మికసంస్థలను పాడుచేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నానని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy