Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వలస బాట

వలస బాట

పెద్దకడుబూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మేకడోన, నౌలేకల్లు, పెద్దకడుబూరు గ్రామాల నుంచి కూలీలు వలస బాట పట్టారు. మంగళవారం దాదాపు 300 కుటుంబాలు పిల్లాపా పలతో కలిసి మూటముళ్లె సర్దుకొని బొలెరో వాహనాల్లో బయల్దేరి వెళ్లారు.

కొన్ని రోజులుగా మండలంలోని ఆయా గ్రామాల నుంచి రో జు 100 నుంచి 150 కుటుంబాలు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వలసలు వెళ్తునే ఉన్నారు. ఒక్క మేకడోన గ్రామంలోనే మంగళవారం మూడు ప్రైవేట్‌ వాహనాల్లో దాదాపు 200 కుటుంబాలు వలస వెళ్లడంతో ఊరిలో ముసలివారితో పాటు కొంతమంది జనం మాత్రమే కనిపిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లోని రైతులు, కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy