Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వన్డే ప్రపంచ కప్ 2027: వెస్టిండీస్‌కు షాక్.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్

వన్డే ప్రపంచ కప్ 2027: వెస్టిండీస్‌కు షాక్.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచ కప్ 2027కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది.

సెప్టెంబర్‌ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో నిలిచే జట్లకు నేరుగా ప్రపంచ కప్‌ బెర్త్‌ దక్కనుంది. ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో కలిపి మొత్తం 10 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అఫ్గానిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు టాప్‌-8లోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా, భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌తో పాటు ఆతిథ్య జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే వన్డే ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించాయి. వెస్టిండీస్‌ ఇంకా భారత్‌తో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. వాటిలో రెండింటినీ గెలిచినా.. అఫ్గానిస్థాన్‌ను వెనక్కి నెట్టి టాప్-10లోకి వచ్చే అవకాశం లేదు.

క్వాలిఫయర్‌ ద్వారా..

వన్డే ప్రపంచ కప్ 2027లో చోటు దక్కించుకోవడం కోసం వెస్టిండీస్ జట్టు.. ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఐర్లాండ్‌తో పాటు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లీగ్‌-2లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు, క్వాలిఫయర్‌ ప్లే ఆఫ్స్‌ నుంచి వచ్చిన జట్లు పాల్గొంటాయి. క్వాలిఫయర్‌లో విజేతగా నిలిస్తే వెస్టిండీస్‌ నేరుగా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ రెండు, మూడు లేదా నాలుగో స్థానాల్లో నిలిస్తే 'సూపర్‌ సిరీస్‌' ప్లే ఆఫ్‌లో ఆడే అవకాశం ఉంటుంది. ఆ దశలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రపంచ కప్‌లో మిగిలిన చివరి బెర్త్‌ దక్కుతుంది.

2023 ప్రపంచ కప్‌కు కూడా వెస్టిండీస్‌ నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫయర్స్‌కు వెళ్లింది. అయితే అక్కడా విఫలమై తొలిసారి ప్రపంచ కప్‌కు దూరమైంది. అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు 2027 ప్రపంచ కప్‌ బెర్త్‌ కోసం మరోసారి క్వాలిఫయర్‌ మార్గాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

strong>

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: పావురాలు.. కోతుల బెడదకు చెక్ పెట్టేలా.. !

మిమ్మల్ని చంపేస్తాం.. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy