Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై మౌనం వీడిన రోహిత్ శర్మ

వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై మౌనం వీడిన రోహిత్ శర్మ

స్పోర్ట్స్ డెస్క్: వచ్చే ఏడాదిలో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీకి చాలా సమయం ఉన్నప్పటికీ.. అందరి దృష్టి టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఉంది.

వీరు 2027 ప్రపంచ కప్‌లో ఆడతారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అలానే పలు సందర్భాల్లో రోహిత్ శర్మ.. రానున్న టోర్నీలో ఆడతాడా అనే అంశంపైనే ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్2027లో తన భాగస్వామ్యం ఉంటుందా లేదా అనే దానిపై తాజాగా రోహిత్ స్పందించాడు.

ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్' కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్‌ను ఓ మీడియా ప్రతినిధి 2027 వన్డే ప్రపంచకప్ ఆడటంపై ప్రశ్నించాడు. దీనికి హిట్‌మ్యాన్ స్పందిస్తూ.. 'అక్టోబర్ 2027 చాలా దూరంలో ఉంది, అప్పుడు ఆలోచిద్దాం' అని సమాధానమిచ్చాడు. అలానే ఇక ఒకవేళ భారత్ మళ్లీ టైటిల్ గెలిస్తే 2024 టీ20 ప్రపంచకప్ విజయానంతరం ముంబైలో నిర్వహించినట్టుగా ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందా? అని మరొకరు ప్రశ్నించారు. ప్రస్తుతానికి అలాంటి బస్ పరేడ్ సాధ్యం కాకపోవచ్చని రోహిత్ తెలిపాడు.

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే.. టెస్టులు, టీ20లకు ఇప్పటికే దూరమైన రోహిత్, వన్డేల్లో మాత్రం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆయన చివరిగా ఇంగ్లండ్‌పై ఆడిన వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (138 పరుగులు) సాధించాడు. ఆ శతకాన్ని గుర్తు చేస్తూ రోహిత్ ఫామ్ పట్ల ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఇటీవలే మీడియా సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

strong>

ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ సాధించిన బుమ్రా... అఫ్గాన్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy