Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వందేభారత్‌ ట్రయల్స్‌

వందేభారత్‌ ట్రయల్స్‌

తిరుపతి అర్బన్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు లోని శ్రీపెరంబదూరులో అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వందేభారత్‌ రైలు మంగళవారం సాయంత్రం రేణిగుంట నుంచి తిరుపతికి దూసుకెళ్తూ కనిపించింది.

ముందు, వెనుక కో ఫైలట్లు మినహా ఖాళీగా వచ్చిన ఈ రైలు మెయిన్టనెన్స్‌ కోసం రైల్వేస్టేషన్‌లోని ఫిట్‌లైను మీద ఆగింది.ముందు, వెనుక ఇంజన్లు, ఎనిమిది బోగీలు, వైట్‌ అండ్‌ బ్లూ కలర్స్‌తో సరికొత్తగా చూపరులను ఆకట్టుకుంది.ట్రయల్స్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన ఈ రైలు త్వరలోనే పూర్తిస్థాయిలో పట్టాలెక్కనుందని సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy