Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వంట గ్యాస్ కు ఎక్కువ డబ్బులు ఇవ్వకండి

వంట గ్యాస్ కు ఎక్కువ డబ్బులు ఇవ్వకండి

నారాయణపేట: వంట గ్యాస్ డెలివరీ కీ ఎక్కువ డబ్బులు చెల్లించ వద్దని పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. గురువారం ఆయన నారాయణ పేట లో డోర్ డెలివరీ కోసం గ్యాస్ రీఫిల్స్ ను తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి విచారించారు. రసీదు మీద ఉన్న మొత్తం మాత్రమే వినియోగదారులు చెల్లించాలని చెప్పారు. చాలా మటుకు జనం గ్యాస్ డెలివరీ సమయంలో "ఎంత" అని డెలివరీ బాయ్ నే అడిగి , వాళ్ళు అడిగినంత ఇచ్చే అలవాటు చేసుకున్నారని చెప్పారు.

అక్రరాస్యులు సైతం రసీదు మీద ఎంత ఉంది చూడకుండా .. ఎంతివ్వాలి ఆని అడగటం ,ఆ తర్వాత అడిగినంత డబ్బు ఇవ్వటం పరిపాటి గా మారిందన్నారు. ఏ ఒక్క రూపాయి కూడా ఉత్తగానే రాదన్న విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచు కోవాలి అని వివరించారు.

గ్యాస్ కావాలా..వద్దా అని ఒక వేళ డెలివరీ బాయ్ గట్టిగా మాట్లాడితే స్థానిక పోలీసులకు లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే తగిన సమగ్ర దర్యాప్తు జరిపి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం పై చట్ట రీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy