Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరద నీటిలో చిక్కుకున్న కుక్క.. చివరకు ఏమైందంటే..

వరద నీటిలో చిక్కుకున్న కుక్క.. చివరకు ఏమైందంటే..

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అలాగే భారీ ప్రాణ, ఆస్తి నష్టం స్తంభవించింది. వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్న ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వరద నీటిలో చిక్కుకున్న ఓ కుక్కను రెస్క్యూ టీం కాపాడింది.

మహారాష్ట్రలోని కార్లా గ్రామంలో ఓ కుక్క వరద నీటిలో చిక్కుకుంది. దీంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. దానిని రక్షించాయి. దాంతో ఆ బృందాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఇది నిజమైన మానవత్వం అని పేర్కొన్నారు. ఇది హృదయాన్ని హత్తుకునే దృశ్యం అని అంటున్నారు.

మరో వైపు భారీ వర్షాల కారణంగా.. ముంబైలో రైల్వే ట్రాక్‌పై ఉన్న కుక్కను రక్షించేందుకు ట్రైన్‌ను లోకో పైలట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో లోకో పైలట్‌ను నెటిజన్లు మెచ్చుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే కార్లాలో వరద నీటిలో చిక్కుకున్న కుక్కును రెస్క్యూ టీం రక్షించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy