Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరదలతో అస్సాంలో 95కు పెరిగిన మరణాలు

వరదలతో అస్సాంలో 95కు పెరిగిన మరణాలు

గువాహటి, ఆగస్టు 5: అస్సాంలో సంభవించిన భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 95కి చేరగా.. రాష్ట్రవ్యాప్తంగా 25జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది.

చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ఇప్పటికి 365కు పైగా గ్రామాలు నీట మునిగే ఉన్నాయి. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, 15వేలకు పైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతిన్నది. విపత్తు తీవ్రతను పరిశీలించేందుకు అస్సాం సీఎం హిమంత కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో అస్సాంలో మళ్లీ వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy