Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరల్ట్ నం.1 బౌలర్ కావడంపై స్పందించిన శ్రీ చరణి

వరల్ట్ నం.1 బౌలర్ కావడంపై స్పందించిన శ్రీ చరణి

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో సరికొత్త రికార్డులతో భారత్ స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి దూసుకుపోతుంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

దీనిపై శ్రీ చరణి స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టంతా ప్రపంచకప్ గెలవడం పైనే ఉందని స్పష్టం చేసింది. ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె(12*) సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షోర్ణా అక్తర్ వికెట్ తీయడం ద్వారా శ్రీ చరణి ఈ టోర్నీలో తన 11వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. తద్వారా 2020 ప్రపంచ కప్‌లో పూనమ్ యాదవ్ (10 వికెట్లు) పేరిట ఉన్న భారత రికార్డును ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బద్దలు కొట్టింది.

ఈ సందర్భంగా ఓతో ఆమె మాట్లాడుతూ.. 'ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా ప్రపంచకప్‌పైనే ఉంది. వ్యక్తిగత ర్యాంకింగ్స్ సంతోషాన్ని ఇస్తాయి, కానీ అవి నా ప్రాధాన్యత కాదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ జట్టుకు విజయాన్ని అందించడమే నా కర్తవ్యం' అని పేర్కొంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు చేజారినప్పటికీ ఒత్తిడికి లోనవ్వలేదని, క్యాచ్‌లు జారడం ఆటలో భాగమేనని పరిణతితో కూడిన సమాధానమిచ్చింది.

షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్, గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తదుపరి జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకమైనదని, అయితే తాము ఎలాంటి అదనపు ఒత్తిడి లేకుండా ఎప్పటిలాగే ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తామని చరణి ధీమా వ్యక్తం చేసింది.

నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy