వరంగల్: బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై జితేందర్ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలంలోని ఓ గిరిజన తండాలో 13 ఏళ్ల బాలికపై ఏడాది క్రితం అదే తండాకు చెందిన బాలుడు లైంగికంగా లొంగదీసుకున్నాడు.
ఈ క్రమంలో ముగ్గురు బాలురు లైంగికంగా వేధించారని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలికపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

