Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వయస్సు 60...ర్యాంకు 9

వయస్సు 60...ర్యాంకు 9

  • లాసెట్‌లో రాణించిన రిటైర్డ్‌ అధికారి

ముదినేపల్లి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): చదవాలన్న తపన, పట్టుదల ఉంటే వయసు అడ్డురాదని ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రుకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి నిరూపించారు.

బొప్పన నాగమల్లేశ్వరరావు ఇటీవల లైఫ్‌ ఇన్సూరెన్సు కార్పొరేషన్‌ బ్రాంచ్‌ మేనేజర్‌గా రిటైరయ్యారు. ఆయనకు న్యాయ విద్యపై ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రైవేటుగా లా చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడైనా కోర్కె నెరవేర్చుకోవాలని మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులో ప్రవేశానికి... 2026-27 విద్యా సంవత్సరానికి ఏపీలాసెట్‌ పరీక్షలు రాశారు.

ఫలితాలు సోమవారం వెలువడగా వందకు వంద మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో ఆయన రాష్ట్ర స్ధాయిలో 9వ ర్యాంకు సాధించారు. 60 ఏళ్ల వయస్సులో పోటీ పరీక్షలు రాసి, మంచి ర్యాంకు సాధించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy