Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం

వెలిగొండ నీటి ప్రవాహంలో చిక్కుకున్న యువకులు.. రక్షించిన రెస్క్యూ టీం

మార్కాపురం,సెప్టెంబర్01: జిల్లాలోని పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలోని వెలిగొండ నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులోని ముగ్గురు యువకులు సమీపంలోని చెట్టు ఎక్కి రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే జిల్లా అధికారులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి.. ఆ యువకులను రెస్క్యూ టీం కాపాడింది.

వెలిగొండ నుంచి వస్తున్న కృష్ణా జలాలు చూసేందుకు ముంపు గ్రామం కలనూతల వెళ్లి.. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్నట్లు ఆ యువకులు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును సోమవారం సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం విదితమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy