- ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ
బెంగళూరు: కరోనా కారణంగా ఉన్నత విద్యావిభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ ఏడాది ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ స్పష్టం చేశారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ డిప్లమోతోపాటు ఉన్నత విద్యావిభాగానికి సంబంధించిన అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. వీటిలో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో వ్యత్యాసం ఉండదన్నారు. పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఉండవని, ఆ వెంటనే తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు.
ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో చదివే 1.60 లక్షలమంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశామన్నారు. గత ఏడాది 1.10 లక్షలమంది విద్యార్థులకు అందించామన్నారు. తరగతి గదులను స్టూడియోలుగా మార్చామని, అన్ని స్మార్ట్‌క్లాస్ కేంద్రాలుగా మారాయన్నారు.

