హుజూరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చే రోగులు, విధులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు.
ఫ సైదాపూర్ పీహెచ్‌సీ తనిఖీ
సైదాపూర్: సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలోని రికార్డ్‌లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైదాపూర్ పాథమిక ఆరోగ్య కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయని, మీరు ఎమి చేస్తున్నారని సూపర్‌వైజర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఇకపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.

