అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): 'విధ్వంసం, అహంకారం జగన్ నైజం. అతనికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోమవారం అన్నారు.
'అమరావతిపై నిత్యం విషం చిమ్ముతున్న జగన్... తాజాగా మావిగన్ పేరుతో మరోసారి తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల దశ దిశ లేకుండా పోయిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు శ్రమిస్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. కోర్టులన్నా, చట్టసభలన్నా జగన్‌కి గౌరవం లేదు.
2019లో ప్లాన్ ఏతో జగన్ రాష్ట్ర ప్రజలను వంచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్లాన్ బీతో మళ్లీ మరోసారి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తానని జగన్ చెబుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన రాజధాని విషయంలో జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటం అతని విధ్వంసకర నైజానికి నిదర్శనం' అని విమర్శించారు.

