Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ (FIR)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి ఉన్నామని ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హామీని అత్యంత బాధ్యతగా అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది (Supreme Court on Student Protest).

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీ కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా విద్యార్థులపై అనవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగించకూడదని సూచించింది. విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది (Delhi CJP Protest).

ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తు అంశంపై వివాదం కొనసాగుతుండటంతో, ప్రభుత్వం తన హామీని ఎలా అమలు చేస్తుందనే అంశంపై కోర్టు దృష్టి సారించింది (Student Agitation, Legal Action). ఇక విద్యార్థుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఎఫ్‌ఐఆర్‌లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.

ఈ వార్తలనూ చదవండి:

జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు

ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy