Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని

విజయవాడ డెంటల్ కాలేజీలో రూ.60లక్షలతో అభివృద్ధి పనులు.. ప్రారంభించిన ఎంపీ చిన్ని

విజయవాడ, సెప్టెంబర్ 3: నగరంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ చైర్స్, సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు(గురువారం) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. డెంటల్‌ కళాశాల ఆవరణలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. 24 బెడ్‌లు, సీసీ రోడ్‌లను ప్రారంభించామని.. 500 మందికి ప్రతిరోజూ ఓపీ ఉంటుందని చెప్పారు. మెడికల్ యూనివర్శిటీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఆర్ఓ ఫ్లాంట్, పేషెంట్‌ల కొరకు షెడ్‌లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యాన్ని కూడా తీసుకొస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.

భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు పెంచుతాం: గద్దె రామ్మోహన్

ఇక్కడ డెంటల్ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2014కు ముందు మోకాళ్ల లోతు నీరు ఉండేదని.. ఆ తరువాత సీసీ రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఇప్పుడు అరవై లక్షలతో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు పెంచుతామన్నారు. భవిష్యత్తులో ఐదు వేల మంది ఓపీకి రావాలని భావిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy