Dailyhunt
విజయవాడలో దారుణం.. యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్..

విజయవాడలో దారుణం.. యువతిపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్..

విజయవాడ: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట వారిపై కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా కామవాంఛలు తీర్చుకుంటూ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా చిక్కితే పాపం.. అత్యాచారాలకు తెగపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి విజయవాడలో జరిగింది. ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లాడు కామాంధుడు. భయభ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లాడు.

అనంతరం యువతిపై అత్యాచారానికి ఒడికట్టాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలిపెట్టి ఆటోతో సహా పరారయ్యాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయం తల్లికి చెప్పింది. షాక్‌కు గురైన బాధిత కుటుంబం మాచవరం పోలీసులను ఆశ్రయించారు. తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు యువతి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నగర వాసులు కోరుతున్నారు. కఠిన శిక్షలు వేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

strong>

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ పార్టీ దిమ్మెలు ధ్వంసం

ఏపీలో ప్రైవేట్‌ కోచింగ్ సెంటర్లకు నయా రూల్స్.. తప్పక పాటించాల్సిందే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy